తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత సాధారణ స్థాయిలోనే ఉంది. మొదట్లో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ప్రజలను , ప్రభుత్వాన్ని భయపెట్టగా..ప్రస్తుతం మాత్రం ప్రతి రోజు వెయ్యి లోపే కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన బులిటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 518 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ కేసులతో కేసుల సంఖ్య 2,84,074కు పెరిగింది. కొత్తగా 491 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తం 2,75,708 మంది కోలుకున్నారు. మరో ముగ్గురు వైరస్‌కు బలవగా.. మొత్తం 1527 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 97.05శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6839 యాక్టివ్ కేసులున్నాయని, మరో 4723 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పింది.