తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు, ఆంక్షలు విదిస్తున్నప్పటికీ మాయదారి మహమ్మారి మాత్రం బుసలు కొడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1982 కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటిన్ లో తెలిపారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 79,495కు చేరింది.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,869గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1669 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 55,999 కు చేరింది. ఇక శనివారం మరో 12 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 627కి చేరింది.