Site icon TeluguMirchi.com

తెలంగాణ లో మళ్లీ పెరుగుతున్న కేసులు..

తెలంగాణ లో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ కేసులు పెరగడం మొదలు పెట్టింది. గత వారం కాస్త కేసుల సంఖ్య తగ్గడం తో హమ్మయ్య అనుకున్నారో లేదో..మళ్లీ ఈ వారం పెరగడం స్టార్ట్ అయ్యింది. మొన్నటి వరకు రెండు వేల వరకు నమోదు కాగా..మంగళవారం మళ్లీ మూడు వేలు క్రాస్ అయ్యి షాక్ ఇచ్చింది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 3018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 25,685 యాక్టివ్ కేసులు ఉండగా.. 85,223 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1,060 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 10 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 780కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 95, జీహెచ్ఎంసీ 475, జగిత్యాల 52, జనగాం 20, జయశంకర్ భూపాలపల్లి 37, గద్వాల్ 37, కామారెడ్డి 76, కరీంనగర్ 127, ఖమ్మం 161, ఆసిఫాబాద్ 11, మహబూబ్ నగర్ 56, మహబూబాబాద్ 60, మంచిర్యాల 103, మెదక్ 40, మేడ్చల్ 204, ములుగు 26, నాగర్ కర్నూల్ 38, నల్గొండ 190, నారాయణపేట 14, నిర్మల్ 41, నిజామాబాద్ 136, పెద్దపల్లి 85, రాజన్న సిరిసిల్ల 69, రంగారెడ్డి 247, సంగారెడ్డి 61, సిద్ధిపేట 88, సూర్యాపేట 67, వికారాబాద్ 21, వనపర్తి 46, వరంగల్ రూరల్ 61, వరంగల్ అర్బన్ 139, యదాద్రి భోనగిరిలో 44 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version