తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రాష్ట్ర సడలింపుల తర్వాత ప్రతి రోజు భారీగా కేసులు నమోదు అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి రాష్ట్రంలో 90 వేల మార్క్ ను దాటింది. గడిచిన 24 గంటల్లో 1863 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం తో కేసుల సంఖ్య 90,259కి చేరినట్లు హెల్త్ బులిటిన్ తెలిపింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా తో 10 మంది మృతిచెందారు.
ఇక జిల్లావారీగా కేసులు చూస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 394, మేడ్చెల్ 174, కరీంనగర్ 104, వరంగల్ అర్బన్ 101, రంగారెడ్డి జిల్లా 131, సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, జగిత్యాల 61, సిద్దిపేటలో 60 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.