తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల మార్కును దాటేసింది. నిన్న 22,046 శాంపిళ్లు పరీక్షించగా 1,921 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ బాధితుల మారినవారి సంఖ్య 88,396కు పెరిగింది.
ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే..గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 356, ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 34, జగిత్యాల్ 40, జనగాం 38, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్ 51, కామారెడ్డి 44, కరీంనగర్ 73, ఖమ్మం 71, కొమరం భీమ్ అసిఫాబాద్ 17, మహబూబ్ నగర్ 48, మహబూబాబాద్ 38, మంచిర్యాల్ 18, మెదక్ 39, మేడ్చల్ మల్కాజ్గిరి 168, ములుగు 12, నాగర్ కర్నూల్ 26, నల్గొండ 73, నారాయణ్‌పేట్ 6, నిర్మల్ 37, నిజామాబాద్ 63, పెద్దంపల్లి 54, రాజన్న సిరిసిల్ల 33, రంగారెడ్డి 134, సంగారెడ్డి 90, సిద్ధిపేట్ 63, సూర్యాపేట 47, వికారాబాద్ 14, వనపర్తి 41, వరంగల్ రూరల్ 54, వరంగల్ అర్బన్ 74, యాద్రాది భువనగిరి 16 కేసులు నమోదయ్యాయి.