Site icon TeluguMirchi.com

తెలంగాణ లో కొత్తగా 2909 కరోనా కేసులు, 6 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2909 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,24,091 కేసులు నమోదు కాగా, ఇందులో 3,04,548 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 17791 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో 6 గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1752కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 584 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 487 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 289, రంగారెడ్డి లో 225 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.

Exit mobile version