తెలంగాణలో కొత్తగా 1498 పాజిటివ్ కేసులు, 6 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 314735 కేసులు నమోదు కాగా, ఇందులో 3,03,013 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 9993 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో 6 గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1729కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 245 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 313 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 164, నిజామాబాదు లో 142 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.