తెలంగాణ లో కరోనా ఉదృతి భారీగా తగ్గింది..

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కరోనా కేసులు భారీగా తగ్గాయి. ప్రతి రోజు రెండు వేలకుపైగా నమోదు అవుతూ వచ్చిన కేసులు..సోమవారం తెలిపిన హెల్త్ బులిటిన్ లో కేవలం 1,417 కేసులు మాత్రమే నమోదు అయ్యి ఊపిరి పీల్చుకునేలా చేసాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,417 కొత్త కేసులు నమోదు కాగా..13 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,513కు చేరగా.. మృతుల సంఖ్య 974కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,479 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,27,007కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30532 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లావారిగా కేసులు చూస్తే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 264, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల్‌ 34, జనగాం 20, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్‌ 12, కామారెడ్డి 11, కరీంనగర్‌ 108, ఖమ్మం 37, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 34, మహబూబాబాద్‌ 54, మంచిర్యాల్‌ 28, మెదక్‌ 13, మేడ్చల్ మల్కాజ్‌గిరి 25, ములుగు 9, నాగర్‌ కర్నూల్‌ 32, నల్గొండ 47, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 8, నిజామాబాద్‌ 67, పెద్దంపల్లి 39, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 133, సంగారెడ్డి 107, సిద్ధిపేట్‌ 75, సూర్యాపేట 34, వికారాబాద్‌ 6, వనపర్తి 19, వరంగల్‌ రూరల్‌ 20, వరంగల్‌ అర్బన్‌ 70, యాద్రాది భువనగిరి 23 కేసులు నమోదయ్యాయి.