తెలంగాణ లో బిజెపి పార్టీ కి పెద్ద షాక్ తగిలింది..

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌ల‌సలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీకి చెందిన ముగ్గురు నగర పాలక సంస్థ కార్పొరేటర్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ బీజేపీ 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్, 9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) గులాబీ గూటిలో చేరిపోయారు. హైదరాబాద్‌లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.