తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్ననే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం..ముఖ్యముగా రాజకీయ నేతలు ఎక్కువ సంఖ్య లో దీనిబారిన పడుతుండడం తో సమావేశాలకు హాజరై ముందే కరోనా టెస్ట్ లు చేసి లోనికి రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో కీలక ఉద్యోగికి కరోనా రావడం అందరిలో భయం పుట్టిస్తుంది. అతను అసెంబ్లీలోనికి పాసులు జారీ చేసే వ్యక్తి కావడం గమనార్హం.
సోమవారం కరోనా లక్షణాలు కనిపించడంతో అతడు మరోసారి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది. ఈ నివేదికలో తనకు పాజిటివ్ వచ్చిందనే విషయం బయటపడింది. దీంతో ఆయన ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఆ ఉద్యోగి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌కు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయన మీడియా సిబ్బంది, ఇతరులకు ఆ అసెంబ్లీ ఉద్యోగి వందల సంఖ్యలో పాసులు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆ పాసులు అందుకున్న వ్యక్తులు, ప్రజాప్రతినిధులు పీఏల్లో ఆందోళన నెలకొంది.