కరోనా మహమ్మారి అమెరికా ను అతలాకుతలం చేస్తుంది. వేల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడగా..వందల సంఖ్యలు ప్రాణాలు విడిచారు. ఇంకా ఈ కరోనా భారిన పడిన వారు హాస్పటల్ లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాంటీ మలేరియా మందుబిల్లలు హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం అమెరికా ఎదురుచూస్తున్నది.
తమకు ఆ మాత్రలు కావాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాను కోరారు. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. కోవిడ్‌ను అరికట్టేందుకు తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ అవసరమని ట్రంప్ అన్నారు. ఇటీవలే ఈ డ్రగ్‌ను ఎగుమతిని భారత్ నిలిపివేసింది.
యాంటీ మలేరియా డ్రగ్‌తో మంచి ఫలితాలే వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇండియా భారీ మొత్తంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను రిలీజ్ చేస్తుందని ఆశిస్తున్నాని, ఒకవేళ భారత్ అలా చేస్తే ఎంతో రుణపడి ఉంటామని ట్రంప్ అన్నారు.