Site icon TeluguMirchi.com

ట్రంప్ తీసుకునే అతి పెద్ద నిర్ణయం

కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. కొంతకాలంగా రోజూ దాదాపు రెండు వేల మంది వరకూ మృత్యువాత పడడంతో ఆ దేశంలో పరిస్థితి దయనీయంగా తయారైంది. వైరస్ కట్టడిపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించడంతో ఆర్థిక రంగం దెబ్బతింది.

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు దేశాన్ని ఎప్పుడు తెరవాలన్న దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్‌ తెలిపారు. దీనికోసం నిపుణులు, సలహాదారులు, కొవిడ్‌-19పై ఏర్పాటు చేసిన కార్యదళం సూచనల్ని తీసుకుంటానన్నారు. దేశంలో ఆంక్షల్ని ఎప్పుడు ఎత్తివేయాలన్నది సవాల్‌గా మారిందన్నారు. ఇప్పటి వరకు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతిపెద్ద నిర్ణయం కాబోతోందని వ్యాఖ్యానించారు.

Exit mobile version