ఈటెల, హరీష్‌ తిరుగుబాటు చేస్తే..?

తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుండి కేసీఆర్‌ వెంట ఉంటున్న వ్యక్తులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌. ఇంకా కొద్ది మంది ఉన్నా వారిని ఇప్పటికే కేటీఆర్‌ దూరం పెట్టాడు అంటూ విమర్శలు ఉన్నాయి. హరీష్‌ రావు మరియు ఈటెల రాజేందర్‌లను మెల్ల మెల్లగా పార్టీకి దూరం చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. రెండవ సారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్‌ రావుకు కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక ఈటెలకు ప్రాముఖ్యత లేని మంత్రి పదవి ఇచ్చాడు.

ఈటెలకు ఇచ్చిన మంత్రి పదవి కూడా తీసేసే అవకాశం కనిపిస్తుంది. ఈటెలను తొలగించిన శాఖకు హరీశ్‌ రావును మంత్రిగా చేస్తాడనే టాక్‌ ఉంది. వీరిద్దరు కూడా కేసీఆర్‌పై చాలా సీరియస్‌గా ఉన్నారని, వారు తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా 30 నుండి 40 మంది ఎమ్మెల్యేలు వారితో ఉంటారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ప్రభుత్వం మనుగడకు కష్టం అవుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వంకు వారు తీసుకు వచ్చే ముప్పు లేదు, అయినా వారిని ఎలా అదుపులో పెట్టాలో కేసీఆర్‌కు బాగా తెలుసు అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.