ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని టిఆర్ఎస్ మరియు టిడిపి కార్యకర్తలు మంగళవారం నాడు డా శ్రవణ్ దాసోజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బంజారాహిల్స్ డివిజన్ కి చెందిన వెంకటరమణ కాలనీ మరియు భోళా నగర్ ప్రాంతంలోని టిఆర్ఎస్ మరియు టిడిపి కి చెందిన మైనారిటీ కార్యకర్తలు అబ్దుల్ రహీం, మహమ్మద్ మునీరుధీన్,అబ్దుల్ జబ్బర్,సమద్,రయిజ్,అబ్దుల్ అలీమ్ మరియు ఇతర సభ్యులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లో చేరి కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావణ్ దాసోజు గారు మాట్లాడుతూ,ఖైరతాబాద్ నియోజకవర్గం లో ఉన్న డ్రైనేజ్ సమస్య, నాలాల సమస్య,రోడ్ల సమస్య ఇతర ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వర్షాలు పడ్డప్పుడు నాలాలు పొంగి పొర్లి ప్రజలు వరద లో కొట్టుకుపోతున్న పట్టించుకునే నాథుడే లేడు.
ఖైరతాబాద్ చౌరస్తా లోని బడా గణేష్ వద్ద గల ఆసుపత్రిని ఆధునీకరించమని ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేదు. సోమజిగూడ పరిది లో ఉన్న మైనారిటీ సోదరులు గతకొన్నేళ్లుగా న్యాయ బద్దంగా రావాల్సిన స్మశాన వాటిక భూమి కోసం పోరాడుతున్న వారిని ఈ ప్రభుత్వ పెద్దలు విస్మరిస్తున్నారు.
స్థానిక శాసనసభ్యుడు ఇరవై ముప్పై వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు దాని ఊసే ఎత్తడం లేదు. కట్టిన ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కేటాయింపులు చేయలేదు. జూబిలిహిల్స్ డివిజన్ లో నిర్మాణ పనులు మొదలు పెట్టిన ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయని వీటి గురించి నియోజకవర్గ ప్రజలతో కలిసి సమస్యల పై పోరాడుతామని అన్నారు. ఈ చేరికలు అధికార పార్టీ విఫలమైందనడానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ముర్తజా, షేక్ ఫిరోజ్ మరియు ఇతర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు