తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ లో భాగంగా లాక్ డౌన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసరమైతే తప్ప రోడ్ల పైకి రాకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తారీఖున టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్ కుమార్ మరో నలుగురితో కలిసి హైదరాబాద్ కు వచ్చే క్రమంలో పహాడీషరీఫ్-శ్రీశైలం రహదారిపై లాక్ డౌన్ డ్యూటీ లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
ఎంపీ స్టిక్కర్ తో ఉన్న కారులో ఎంపీ లేకపోవడం, కారులో నిబంధనలకు విరుద్ధంగా నలుగురుప్రయాణించడంతో వారు కార్ ను పోలీసుస్టేషన్ కు పంపారు. దీంతో భరత్ కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. నేను ఎంపీ కుమారుడినంటూ హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న రాములు పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలిసుల ఫై చిందులు వేశారు. తాను 15 ఏళ్లుగా మంత్రిగా పని చేసానని ఇప్పుడు ఎంపీ ని అని అన్నారు. తన కారుని ఎలా ఆపుతారని ప్రశ్నించాడు.