తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫై తెరాస నేతలు మాటల యుద్ధం మొదలుపెట్టారు. రేవంత్‌రెడ్డి రాళ్లతో కొడితే తాము చెప్పులతో కొడతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదలనే ఓ వివాదమని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
2017లో టీడీపీ నుంచి పార్టీ మారి పదవి కాలం ముగిసే వరకు ఎమ్మెల్యేగా రేవంత్ కొనసాగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ను మొదట రాళ్లతో కొట్టాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.