అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నాయకులు వలస కట్టడం చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం. కొన్ని నెలల క్రితం టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో వలస వెళ్లారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు టీఆర్‌ఎస్ నుండి వలసలు ఉండబోతున్నట్లుగా ఆ పార్టీ నాయకుల్లోనే టెన్షన్ మొదలైందట. కేంద్రంలో అధికాంలో ఉన్న బీజేపీ సౌత్‌లో జెండాలు పాతేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో అధికాంలో ఉన్న బీజేపీ సౌత్‌లో రాష్ట్రాల్లో మాత్రం ప్రభావం చూపలేక పోతుంది. కర్ణాటక కాస్త పర్వాలేదు అనిపించిన తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడులో ఏమాత్రం ప్రభావం లేదు.
తమిళనాడులో రజినీకాంత్‌ను వాడుకుని అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్ పార్టీని తొక్కేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. అదే సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పలువురు బీజేపీలో జాయిన్ కాబోతున్నట్లుగా ప్రకటించాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, కీలక నాయకులు కూడా బీజేపీలో చేరనున్నట్లుగా ఆయన ప్రకటించాడు. టీఆర్‌ఎస్‌కు కీలకమైన హరీష్ రావును బీజేపీ లాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.