తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊపు ఏమాత్రం లేదనే చెప్పాలి..పల్లె , పట్టణం ఇలా ఎక్కడ చూసిన తెరాస హావ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి , తెరాస పార్టీ లో చేరగా..తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు గులాబీ జెండా పట్టుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య.. ఆయనతో పాటు వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మరి కొందరు నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న పొదెం వీరయ్య పార్టీని వీడుతున్నట్లుగా ప్రచారం జరగడం పార్టీలో కలకలం రేపింది. ఇక వరంగల్ డీసీసీ పరిధిలోని పార్టీ వ్యవహారాల్లో జనగామ డీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుంటున్నారంటూ వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన నివాసంలో నాయిని రాజేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మరో సీనియర్ నేత రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ అంశంపైన పార్టీ కోర్ కమిటీలో మాట్లాడదామని ఆయనకు సూచించారు. పొదెం వీరయ్యకు ఫోన్ చేసిన వీహెచ్… ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆయనను కోరినట్టు తెలుస్తోంది.