మొత్తానికి జీహెచ్ఎంసీ మేయర్ ఎవరో తేలిపోయింది. జీహెచ్ఎంసీ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి మోతే శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి అధికారికంగా ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్లకు శ్వేతామహంతి శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి, డిప్యూటీ మేయర్ శ్రీలతకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.