ఆ మూడు పార్టీలు ముచ్చట పడుతున్నాయి..!

bjp-trs-cpi’రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు’ అసెంబ్లీకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కెయాయి. పరస్పర నినాదాలతో సభ దద్దరిల్లిపోతోంది. సభ ప్రారంభమై కనీసం రెండు నిమిషాలైన అవుతుందో… లేదో .. ఇరు ప్రాంతాల నేతలు నినాదాలతో సభను హోరెత్తించడం జరుగుతోంది. దీంతో.. నిస్సహయత స్థితిలో సభను స్వీకర్ వాయిదా వేయడం జరుగుతోంది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇదే తంతు. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు పట్టుమని పది నిమిషాలు కూడా సభ సజావుగా సాగింది లేదు. కీలకమైన టీ-బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే నేటి నుంచి అసెంబ్లీ వాయిదా పడనుంది.

అయితే, సభను వాయిదా వేయకుండా విభజన బిల్లుపై సుదీర్ఘంగా చర్చించాలని ముచ్చటపడుతున్నాయి మూడు పార్టీలు. అవే.. తెరాస, బీజేపీ, సీపీఎంలు. ఇందుకోసం ఈ మూడు పార్టీలు కలసి స్వీకర్ నాదెండ్ల మనోహర్ కు ఓ లేఖను కూడా రాశాయి. శాసనసభను వాయిదా వేయకుండా టీ-బిల్లుపై చర్చించాలని లేఖలో పేర్కొన్నాయి. ఆది నుంచి తెలంగాణకు పూర్తి మద్దతు తెలుపుతున్న ఈ మూడు పార్టీలు ఇలా పట్టుపడ్డటంలో ఆశ్చర్యమేమీ లేదేమో. అయితే, వీరి అభ్యర్థనకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలను కొనసాగించినట్లయితే.. మిగతా పార్టీల నేతలు సహరిస్తారా అనేది ప్రశ్నార్థకమే.

టీ-బిల్లుపై చర్చకు తక్షణం పట్టుబడుతున్న ఈ మూడు పార్టీలకు తెదేపా, కాంగ్రెస్ కు చెందిన తెలంగాణ నేతలు సహరించే అవకాశం వున్నప్పటికినీ.. సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న వైకాపా నేతలు సహకరించే పరిస్థితి కనబడటం
లేదు. ఈ నేపథ్యంలో… టీ-బిల్లుపై చర్చకు పట్టుపడుతున్న ఈ మూడు (తెరాస, బీజేపీ, సీపీఎం) పార్టీల అభ్యర్థనను స్వీకర్ పాజిటివ్ గా స్పందిస్తారా.. ? అనుమానమే.