తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుక

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ స్థాపించి నేటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలు జరిపారు. కరోనా కారణంగా పార్టీ ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా పూర్తి చేసారు. కొద్ది మంది నేతలను మాత్రమే టీఆర్ఎస్ కార్యాలయంలోకి అనుమతించారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించిన గులాబీ అధినేత కేసీఆర్.. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఇక, అనంతరం గులాబీ జెండాను ఎగురవేశారు. అయితే, జెంగా విష్కరించిన వెంటనే తెలంగాణ భవన్‌ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు కేసీఆర్. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతోపాటు, సాధించుకున్న తెలంగాణలో అన్నిరంగాల్లో టీఆర్‌ఎస్‌పార్టీ గొప్ప విజయాలను సాధించిందని సంతృప్తి వ్యక్తంచేశారు.