‘సమైక్య’ పిటిషన్లపై విచారణ వాయిదా

scసుప్రీం కోర్టులో దాఖలైన సమైక్య పిటిషన్లు అయినా.. రాష్ట్ర విభజనను అడ్డుకుంటాయేమోనని భావించిన సమైక్య వాదులకు కొంత నిరాశే ఎదురైంది. అయితే, కాస్త ఊరట కలిగించే విషయమేమిటంటే.. గతంలో ఎపి విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల మాదిరిగా కొట్టివేయబోమని,వాదనలు వింటామని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది. వాదనలను తగు సమయంలో వింటామని చెప్పిన న్యాయస్థానం ప్రస్తుతానికి విచారణను వాయిదా వేసింది. కాగా, ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, నారిమన్ లు సమైక్య స్పూర్తికి విరుద్దంగా విభజన జరుగుతోందని, శాసనసభలో తీర్మానం జరగాలని గతంలో సుప్రింకోర్టు కూడా చెప్పిందని వారు వాదించారు.