Site icon TeluguMirchi.com

ఢిల్లీలో.. బాబుకు చికిత్స !

NCBN_NEWతెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్రతో ఏర్పడిన శారీరకమైన ఆరోగ్యసమస్యలకు ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కాలినొప్పితో బాథపడుతున్న బాబు చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ’వర్ధన్’ ఆసుపత్రిలో  చేరారు. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో.. ఢిల్లీ వెళ్లిన బాబు అక్కడే ఉండి కాలునొప్పికి చికిత్స తీసుకుంటారని తెలుస్తోంది. చికిత్స కారణంగా ఆయన రేపు కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. “వస్తున్నా.. మీకోసం” పాదయాత్రలో భాగంగా.. 63 ఏళ్ళ వయసులోనూ.. రాష్ట్రవ్యాప్తంగా 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల పాదయాత్రను బాబు కొనసాగించిన విషయం తెలిసిందే.

Exit mobile version