అంతా అయోమయం…!

shindeసీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ తీరు అంతుచిక్కడం లేదు. అధిష్టానం ఇచ్చే షాక్ లకు తలలు బాదుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియక అయోమయానికి లోనవుతున్నారు.హైకమాండ్ ఇచ్చే ట్విస్ట్ లకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. తాము కలిసినప్పుడు ఒకరు సానుకూలంగా మాట్లాడినట్టు అనిపించగానే…అంతలోనే మరొకరు కుండ బద్దలు కొట్టినట్టు వెనకకు తగ్గేది లేదని చెప్తున్నారు. దీంతో తమపై అధిష్టానం వైఖరి అర్ధం కాక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు…. ఒకవైపు తీవ్రంగా ఉన్న ఉద్యమాన్ని ఎదుర్కోలేక సతమతమవుతుంటే…అధిష్టానం నేతల మాటలు తమను మరింత ఇరుకున పెడుతున్నాయని వాపోతున్నారు. నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించకపోగా….సీమాంధ్రలో కాంగ్రెస్ మరింత కష్టాల్లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చేంత వరకు తెలంగాణాపై ఏ నిర్ణయం తాము చెప్తుంటే అంతలోనే నోట్ రెడీ అయిందని షిండే ప్రకటించడం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు..