Site icon TeluguMirchi.com

తిరుమల రూ.300 దర్శనం నకిలీ టికెట్ల కుంభకోణం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ టికెట్ల వ్యవహారంలో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. నకిలీ టికెట్లను కానిస్టేబుల్‌ తయారు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు ఈ టికెట్లను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. మూడు రూ.300 టికెట్లను రూ.21 వేలకు విక్రయించినట్లు భక్తులు తెలిపారు. నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ టికెట్ల వ్యవహారం ఎప్పటినుంచి జరుగుతుందనే దానిపై విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లడ్డూ కౌంటర్‌, టికెట్‌ స్కానింగ్‌ వద్ద పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులు ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు సహకరించినట్లు అధికారులు గుర్తించారు.

Exit mobile version