టీ-పై మరో వారం గడువు.. ?

t-bill(1)టీ-బిల్లు గడువు పెంపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీ-బిల్లుపై అసెంబ్లీలో చర్చించేందుకు మరో వారం రోజులు అనగా జనవరి 30వరకు గడువును పెంచుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు వారాల గడువును కోరినప్పటికినీ.. రాష్ట్రపతి మాత్రం వారం రోజులు మాత్రం గడువును పెంచారు.

పెంచిన వారం రోజుల గడువు ముగిసే క్రమంలో.. రాష్ట్రపతి అసెంబ్లీకి మరో వారం గడువును ఇస్తారా.. ? లేదా.. ? అనే విషయంపై ఇప్పుడు విసృతమైన చర్చకు తెరలేచింది. జనవరి 30 అనంతరం మరో వారం గడువు పెంచినట్లయితే.. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో టీ-బిల్లును తీసుకు రావడం కష్టాసాధ్యమవుతోంది.

అయితే, రాష్ట్రపతి మరో వారం రోజుల గడువు ఇవ్వకపోవచ్చని కేంద్ర హోంశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. పైగా.. ఆర్టికల్ 3ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్ ముందుకు తీసుకురావాల్సి వుందని రాష్ట్రపతి నిన్న గడువు పెంచిన సందర్భంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో… టీ-బిల్లుపై మరో వారం గడువుపెంపుపై రాజకీయ వర్గాలో ఉత్కంఠ నెలకొంది.