Site icon TeluguMirchi.com

కిరణ్ కొత్తగా ఏమి చెప్పారు?

kira digఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ కు నోటీసు ఇచ్చిన సంగతి తనకు తెలిసిందని రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సీఎం చెప్పిన దానిలో కొత్త అంశమేమీ లేదన్నారు. ఒకవేళ ఏమైనా రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే దానికి పరిష్కారాలుంటాయన్నారు. బిల్లుపై తీర్మానం విషయంలో స్పీకర్ ఆధ్వర్యంలోని శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మార్చుకునే వెసులుబాటు ఉందని ఆయన అన్నారు. రాజ్యసభ సీట్లకు అభ్యర్ధుల ఎంపిక పార్టీ ప్రయోజనాల రీత్యా జరుగుతుందని అన్నారు.పాతవారినే ఎంపిక చేయాలన్న నిబందన ఏదీ లేదని అన్నారు.

అంతకుముందు దిగ్విజయ్ సింగ్ భేటి అయిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఆయన చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ పై తాను ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. విభజన బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, తీర్మానానికి ఆస్కారం ఉండకూడదన్నారు. విభజన వల్ల తెలంగాణ నష్టంపోతుందని చెప్పేవాళ్లు..తెలంగాణను పట్టుకుని ఎందుకు వేలాడుతన్నారని ప్రశ్నించారు.

Exit mobile version