హైదరాబాద్ అభివృద్ధి నా బాధ్యత

‘నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ అభివృద్ధి నా బాధ్యత’ అని సీఎం తెలిపారు. డిసెంబర్ 2013నాటికి కృష్ణా జలాలను నగరానికి తరలిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఉప్పల్ లో మెట్రోరైలుప్రాజెక్టు రెండవ దశ పనులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగాసీఎం మాట్లా డారు.“డిసెంబర్, 2014 నాటికల్లా మెట్రో ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. మెట్రోరైలు నిర్మాణం ఒక్క రోజు ఆలస్యమైనా ఎల్ అండ్ టీ కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంద”నిసీఎం హెచ్చరించారు. రాష్ట్రప్రజల సహకారంతో విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్నానని సీఎం అన్నారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్నచంద్రబాబు మెట్రో రైలును ఎందుకుతీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. చేసిన పాపాలు కడుక్కోవాలంటే చంద్రబాబు ఇంకా చాలందూరం నడవాలన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎజెండాలో ఉన్నవన్నీ కాంగ్రెస్ సంక్షేమ పథకాలేనన్నారు.కాంగ్రెస్‑ను కాంగ్రెస్ వాళ్లే ఓడించుకుంటారు తప్ప, వేరే పార్టీ ఓడించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీప్రభుత్వాలే 2014లో కూడా రాష్ట్రం, కేంద్రంలో కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేశారు.