కేసీఆర్ హీరోగా.. టీజీ సినిమా…!

KCR-tgతెరాస అధినేత కేసీఆర్ అంగికరిస్తే… అతనితో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అయితే, ఆ సినిమాని సందేశాత్మకంగా నిర్మించి సమైక్యాంధ్రులకు అంకితం ఇస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్ లో టీజీ విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ధూమపానానికి స్వస్తి చెప్పి వ్యవసాయంపై అనురక్తి పెంచుకోవడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు. దీన్నో శుభపరిణామంగా టీజీ అభివర్ణించారు.