టెట్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించలాని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మరల రాసుకోవచ్చు అని తెలిపారు.
Also Read : ‘కల్కి 2’ లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ ?