గవర్నర్‌ పదవీకాలం పై కేంద్రం ప్రకటన

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పదవీకాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్‌గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

2010 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు నరసింహన్‌ . 2012 మే 3న మొదటి విడత పదవీకాలం ముగిసింది. కేంద్రం మళ్లీ ఇక్కడే నియమించింది. నిన్న ఆయన మూడో విడత పదవీకాలమూ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాత్కాలిక పొడగింపు ప్రకటించింది.

ఉద్యమ కాలం, రాష్ట్ర విభజనతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయ సాధన, విభజన సమస్యల పరిష్కారానికి గవర్నర్ ప్రత్యేక చొరవ ప్రదర్శించారు. దీంతో ఇంకా మిగిలిన ఉన్న వివాదాస్పద అంశాలన్నీ చక్కబడే వరకు ఆయననే గవర్నర్ గా కొనసాగించాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది. జులైలో రాష్ట్రపతి ఎన్నికల తర్వాత దీనిపై మరో నిర్ణయం వెలువడే అవకాశమూ ఉంది.