Site icon TeluguMirchi.com

ఇక ’తెలుగు’లో సొల్లు.. !!

ponnalaతెలుగు భాషాప్రియులకు శుభవార్త. ఇక మీదట తెలుగులో (మెసేజెస్) సంక్షిప్త సందేశాలను పంపించవచ్చు. దీనికి సంబంధించిన ’తెలుగు మాట’ అప్లికేషన్ (యాప్)ను సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విడుదల చేశారు. ఈ అప్లికేషన్ ఆడ్రాయిడ్ , ఐవోఎస్ సాఫ్ట్ వేర్ తో నడిచే ఫోన్లు, ట్యాబ్లెట్ లలో పనిచేస్తుందని పొన్నాల తెలిపారు. సామావేజిక అనుసంధాన వెబ్ సైట్స్ ఫేస్ బుక్, ట్విట్టర్… తదితర వేదికల్లోనూ.. ఈ తెలుగు యాప్ ఉపయోపడతుంది. అన్నట్టు, ఈ ’తెలుగు మాట’ యాప్ ను ఐటీశాఖ పరిథిలోని ఏపీ సోసైటీ ఫర్ నాలెడ్జీ నెట్ వర్క్స్ అభివృద్ధి చేసింది. ఇక మీదట.. హాయిగా తెలుగులోనే సెల్ ఫోన్ లో సొల్లు వేసుకోవచ్చన్న మాట.. !

Exit mobile version