ఈ సమయంలోనే మోడీకి అనుకూలంగా, జగన్‌కు మద్దతుగా ప్రజలు నిలిస్తే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, ఒక వేళ వైకాపా ఒంటరిగా పోటీ చేస్తే జగన్‌కు ప్రభుత్వంను ఏర్పర్చే స్థాయిలో సీట్లు రావు అనేది కొందరి వాదన. మొత్తానికి కష్టమో నష్టమో బీజేపీతో టీడీపీ కలిసి ఉంటేనే మంచిది అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికలు మరెంతో దూరం లేవు. మరి ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.