ఇంటింటికి త్రాగునీరు

Telangana-Water-Grid
రానున్నా నాలుగేళ్లో ఇంటింటికి త్రాగునీరు అందించే తెలంగాణ డ్రికింగ్ వాటర్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్.అందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. 26 సెగ్మెంట్ ల కు గాను రెండు విడుతలుగా టెండర్లు పిలువనున్నారు.తొలివిడుత పదకొందు సెగ్మెంట్లకి అగస్టు 7 తేది నుండి అన్ లైన్ లో టెండర్ల పిలువనన్నారు. 14 రొజుల పాటు టెండర్ల స్వీకరణ ఉంటుంది. మిగిలిన 15 సెగ్మెంట్లకి రెండు విడతలుగా,రెండు
దశల్లో అగస్టు 30 నాటికి టెండర్ల ప్రకటన ఇవ్వనున్నారు.

కాగా తొలి విడుతలో వివిధ జిల్లాలో ఏ మేరకు టెండర్ల అంచనా వ్యయం ఉంటుందో కూడ సర్కార్ ప్రకటించింది. పాలమూర్- శ్రీశైలం లో 5953 కోట్లు.మహబూబ్ నగర్-జూరాల లో 700 కోట్లు. రంగారెడ్డి-మెడ్చల్ 160. వరంగల్- పాలేరు1700. నల్గొండ2106. నల్గొండ టెయిల్ పాండ్ కు 1485.మెదక్ – సంగరెడ్డి 680 .మెదక్-గజ్వేల్ 600. వరంగల్ 840 కోట్లు. అదిలాబాద్-ఎల్లంపల్లి-కడెం కు 670. ఖమ్మం-పాలేరు-వైరా కు 993 కొట్లు కేటాయించారు. మొత్తం 15,887 కోట్ల పనులకి టెండర్ల స్వీకరణ చేపట్టనున్నారు. కాగా ఇందులో మహబుబ్ నగర్ జిల్లాకు అగ్రభాగం దక్కింది.

ఇక మొదట అంచనావ వేసిన విధంగానే అటు డీపీఆర్లో గానీ…ఇటు 35 వేల కోట్ల అంచనా వ్యయంలో గానీ ఎటువంటి మార్పులు చేపట్టకపోవడం విశేషం. కాగా ఇంత పెద్ద ప్రాజెక్టును ఈపిసి విధానం లోకాకుండా ఆర్.డబ్యూ.యస్ శాఖ సిబ్బందితోనే డిపిఆర్ ను తయారు చేయ్యడం మరో విశేషం. డిజైన్ కొసం కేంద్ర ప్రభుత్వ సంస్ధ వ్యాప్కోస్ పరిశీలించిన నేపథ్యంలో డిపియార్లలో ఏలాంటి మార్పులు ఉండడం లేదు.