తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఫలితాలకు ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు వెల్లడించింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ మొదటి రెండో సంవత్సరాల పరీక్షలు కాన్సల్ కాబడ్డాయి. దాంతో రిజల్ట్ ప్రక్రియ ఎలా ఉండాలో ఇవాళ ప్రకటించారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు గతేడాది వచ్చిన మార్కులనే ఈ ఏడాదీ ఇవ్వనున్నారు. ప్రాక్టికల్స్ కు మాత్రం పూర్తి మార్కులు ఇవ్వనున్నారు. గతేడాది ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 మార్కులు, బ్యాక్ లాగ్ సబ్జెక్టులకు 35 మార్కుల చొప్పున ఇస్తారు. మేము పరీక్షలు రాసి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాం అని భావించే విద్యార్థులు కరోనా పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలు రాసుకోవచ్చని ఉన్నత విద్యాశాఖ తెలిపింది.