Site icon TeluguMirchi.com

‘టీ ‘ప్రక్రియ మరింత వేగవంతం!

sonia-gandhi-telanganaసమైక్య ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రక్రియను జాప్యం చేస్తారని పలువురు రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా భావించారు. ఆది నుంచీ కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ముందుకు వెళుతోంది. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నుంచి కేబినెట్ నోట్ ఆమోదం వరకు ప్రతిఫక్షాలకు షాక్ నిస్తూ రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా విభజన ప్రక్రియను తాత్సారం చేస్తారనుకుంటున్న సమయంలో విభజన విషయంలో మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇప్పటికే న్యాయ ప్రక్రియ అంతా పూర్తయిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.అంతేకాదు బంతి రాష్ట్రపతి కోర్టులోకి వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి సంతకం చేయడానికి ముందుగా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ నెల 20లోగా అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీలో ఆమోదం పొందకపోయినా మరోసారి అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారని అధిష్టాన పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్ ను రెండు సార్లు అసెంబ్లీకి పంపుతామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం మీద అసెంబ్లీ అభిప్రాయం ఎలా ఉన్నా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విభజన విషయంలో పరిస్థితులు అనుకూలించినా, అనుకూలించకపోయినా.. తెలంగాణ ప్రక్రియను 2014లోగా ముగించి కాంగ్రెస్ అధిష్టానం మాట నిలబెట్టుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

Exit mobile version