వృద్ద కళాకారులకు పెన్షన్ డబల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ లో వృద్ద కళాకారులకు వృద్దాప్య పెన్షన్లు 1500 వందల రూపాయల నుంచి 3,016 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఈ పెన్షన్లు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుండి కళాకారులకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 2,661 మంది వృద్ధ కళాకారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కి రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.