టీ-నోట్ రెడీ.. !

telanganaరాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. ఆలస్యం చేసినా కొద్ది రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోయేటట్లు వున్నాయని.. అంతేకాకుండా ముఖ్యమంత్రి కిరణ్ ధిక్కారణ ధోరణి కూడా అధిష్టానం విభజన ప్రక్రియ వేగం పెంచడానికి కారణంగా కనిపిస్తోంది. దీంతో సీడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా హైకమాండ్ తెలంగాణ నోట్‌ను సిద్ధం చేసింది. 22 పేజీలతో కూడిన తెలంగాణ నోట్‌ను కేంద్ర తయారు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయగా, సీమాంధ్ర రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అధేవిధంగా, ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కేబినెట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన అనంతరం నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీని నియమించన్నుట్లు సమాచారం. ఈరోజు (గురువారం) సాయంత్రం కేంద్ర కేబినేట్ భేటీ అయి తెలంగాణ నోట్‌పై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినేట్ ఆమోదం తర్వాత తీర్మానం కోసం అసెంబ్లీకి తెలంగాణ నోట్ వెళ్లనుంది. అయితే, ఓ పక్క సీమాంధ్రలో 60రోజులకు పైగా ఆందోళనలు జరుగుతున్నా.. స్వయంగా ముఖ్యమంత్రే విభజనను వ్యతిరేకిస్తున్నా.. అవేవి పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళ్లడం విశేషం.