Site icon TeluguMirchi.com

లాక్ డౌన్ విషయంలో తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు..?

తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 400 కు చేరువ లో ఉండడం తో అధికారులు ఇంకాస్త అప్రమత్తం చేసారు. ఈ క్రమంలో కేసీఆర్ లాక్ డౌన్ ఇంకో రెండు వారాలు పెంచితే మంచిందని..కరోనా వైరస్ కట్టడి కావాలంటే లాక్ డౌన్ తప్ప మరో ఆయుధం లేదని తెలిపాడు. ఈ మేరకు ప్రధాని కి లాక్ డౌన్ పెంచాలనే ప్రతిపాదన తెలిపినట్లు కేసీఆర్ మీడియా తో అన్నారు.

తెలంగాణ వ్యక్తం చేసిన నిర్ణయం బాటలో మరికొన్ని రాష్ట్రాలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర , తమిళనాడు , ఢిల్లీ , రాజస్తాన్‌ , కేరళ , ఉత్తరప్రదేశ్‌ , మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా మరికొన్ని వారాల పాటు “లాక్‌డౌన్” ‌ను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసింది. సో మోడీ కూడా త్వరలోనే లాక్ డౌన్ పొడిగించే ప్రకటన చెప్పవచ్చు.

Exit mobile version