తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు, ఆంక్షలు విదిస్తున్నప్పటికీ మాయదారి మహమ్మారి మాత్రం బుసలు కొడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం కోవిడ్ బారిన పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 615కు చేరింది. 24 గంటల్లో 1091 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ అయిన వారి సంఖ్య 54,330కి చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం 464 కేసులు నమోదు కాగా..వరంగల్ అర్బన్‌లో 187 కేసులు , రంగారెడ్డిలో 181, మేడ్చల్‌లో 138, కరీంనగర్‌లో 101 చొప్పున కేసులు నమోదయ్యాయి. గద్వాల 95, సంగారెడ్డి 92, పెద్దపల్లి 84, సిరిసిల్ల 78, భద్రాద్రి కొత్తగూడెం 79 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.