తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు ఓపక్క లాక్ డౌన్ ను పొడిగించిన..దానిని కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 61 పాజిటివ్ కేసులు నమోదు అయ్యి సంచలనం సృష్టించాయి. ఈ కేసుల తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 573కు చేరింది.
ఇక వాటిలో 103 మంది బాదితుకులు కోలుకున్నారు. ఇప్పటివరకు 17 మంది మరణించారు. ప్రస్తుతం 472 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఎక్కువ కేసులు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదువుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు పేర్కొంది. నగర పరిధిలో కంటైన్మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కరోనాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.