Site icon TeluguMirchi.com

INTSO పరీక్షల్లో మెరిట్‌ విద్యార్థులకు ఎమ్మెల్యే రాగమయి అభినందనలు

సత్తుపల్లి , ఏప్రిల్ 19 : సత్తుపల్లి నగరంలోని శ్రీ చైతన్య స్కూల్లో ( సత్తుపల్లి విద్యాలయం) పాఠశాల నందు జనవరి 22 న జరిగిన INTSO పరీక్షల్లో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అభినందనలు తెలియజేసారు. తరగతుల వారీగా జరిగిన ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పరీక్షల్లో లెవల్ 2 కు గాను దాదాపు 74 మంది మెరిట్ సాధించి లెవల్ 01 కు చేరుకున్నారు.

ఈ సందర్బంగా స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ముఖ్య అతిధిగా హాజరై ..విద్యార్థులను అభినందించారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు కన్సోలేషన్స్ గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. INTSO యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. పోటీ పరీక్షల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ముందుంటారని కొనియాడారు. అదేవిధంగా పోటీ పరీక్షలు నిర్వహించడంలో శ్రీ చైతన్య స్కూల్ ముందు ఉంటుందని..విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ను ఎప్పటికప్పుడు బయటకు తీస్తూ..వారిలో ఉత్సాహం నింపుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ చైర్మన్ సృజనా రాణి, సీనియర్ నాయకులు, స్కూల్ యాజమాన్యం, స్టాఫ్ పాల్గొన్నారు.

Exit mobile version