Site icon TeluguMirchi.com

కరీంనగర్ లో మరో ఇద్దరికీ రోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు కేసులు బయటపడడం అవి కరీంనగర్ లో కావడం ఆ ప్రాంత ప్రజలను మరింత భయానికి గురి చేస్తున్నాయి. నగరంలో పర్యటించిన ఇండోనేషియా బృందంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ద్వారా ఈ ఇద్దరికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు.

ఇండోనేషియా వారితో తిరిగిన వ్యక్తి సోదరి, తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. కుటుంబంలోని ముగ్గురు పిల్లలను కూడా గాంధీ ఆస్పత్రిలో చేర్పించామని శశాంక వెల్లడించారు. ఇక ఆ ముగ్గురిని కలిసిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వారిలో సన్నిహితంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నామని కలెక్టర్ శశాంక తెలిపారు.

Exit mobile version