Site icon TeluguMirchi.com

తెలంగాణ రాష్ట్రంలో ఇంటికే పాల సరఫరా …

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 65 పాజిటివ్ కేసులు బయటపడగా..అందులో ఒకరు మరణించడం షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది.

ఇకపై స్విగ్గీ, బిగ్‌ బాస్కెట్‌ వంటి డోర్‌ డెలివరీ కంపెనీల ద్వారా పాలు సరఫరా చేసేలా చెయ్యాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ భవనంలో శనివారం వివిధ డెయిరీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. లాక్ డౌన్ కారణంగా సప్లై చేసేవారు రావడం లేదని అధికారులు చెప్పడం తో స్విగ్గీ, బిగ్ బాస్కెట్ సేవలు వాడుకోమని మంత్రి ఆదేశించారు. అలాగే పాలఫై ధరలు పెంచకూడదని..పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Exit mobile version