రాహుల్ గాంధీని పప్పు అంటే ఆ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. అవును రాహుల్ గాంధీ పప్పే, నేను మాత్రమే కాదు, దేశం మొత్తం అదే మాట అంటుంది. చివరకు గూగుల్‌లో కూడా రాహుల్ గాంధీ పప్పే అంటూ చెబుతుంది అంటూ ఎద్దేవ చేశాడు. తాను వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తాను అంటూ చేసిన సవాల్‌కు నిల్చుంటాను అని, కాని కాంగ్రెస్ నాయకులు గతంలో పలు సార్లు ఛాలెంజ్ చేసి దాటవేశారు అంటూ కేటీఆర్ విమర్శలు చేశాడు. కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.