తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వైద్య పరీక్షల కోసం ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ‘‘సీఎం కేసీఆర్‌కు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. కడుపునొప్పితో సీఎం ఆసుపత్రికి వచ్చారు. ఎండోస్కోపి, సిటీ స్కాన్ చేశాం. కేసీఆర్ కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్టు గుర్తించాం. సీఎంకు మిగతా వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాం’’ అని ఏఐజీ వైద్యులు అనౌన్స్ చేశారు.