టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతను కోల్పోయింది. సర్పూర్ టి. నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కాసేపటి క్రితమే ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
2009, 2011 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కాగా, 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు రాజీనామా చేశారు సమ్మయ్య, ఆయన భార్య మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ సాయిలీల కూడా టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా, 2009లో సిర్పూర్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు సమ్మయ్య… తిరిగి ఏడాది వ్యవధిలోనే జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన కోనేరు కన్నప్ప చేతిలో ఓడిపోయారు.
కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.