క్షమాపణలు కోరిన హరీష్ రావు..

తెలంగాణ మాజీ మంత్రి..సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణలు కోరారు. రేపు (జూన్ 3) ఆయన పుట్టిన రోజు. ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు , కార్య కర్తల మధ్య ఏంటో ఆర్బాటంగా జరుపుకుంటారు. తెరాస నేతలు , కార్య కర్తలు సైతం ఆయన పుట్టిన రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా..పండగా చేసుకుందామా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఈ పుట్టిన రోజు నాడు మాత్రం వారికీ అందుబాటులో హరీష్ రావు ఉండడం లేదట. హైదరాబాద్‌ లేదా సిద్దిపేటలో కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని హరీష్ రావు చెప్పారు. ఈ సందర్భాంగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరుతూ ఓ చిన్న సందేశాన్ని వదిలారు.