Site icon TeluguMirchi.com

లాక్ డౌన్ ఎఫెక్ట్ : మీ బ్యాంకు ఖాతాల్లో రూ. 1500 పడ్డట్లే

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా గత 21 రోజులుగా ప్రజలు తమ పనులను పక్కకు పెట్టి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో రోజువారీ కూలి చేసుకొని కుటుంబం పోషించే వారి జీవితం దారుణంగా ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా..తాజాగా మరోసారి దీనిపై మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. “గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం..తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకి లింక్ అయి ఉన్నటువంటి 74లక్షల పైగా బ్యాంక్ ఖాతల్లో 1500 జమ అవుతాయని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం రూ. 1,112 కోట్లను ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు తెలిపారు.

Exit mobile version