ప్రారంభమైన తెలంగాణ కాబినెట్ సమావేశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రగతిభవన్‌లో కాబినెట్ సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశంలో కరోనా ఫై ప్రధాన చర్చ జరపనున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే దిశగా ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఇప్పటికే కేసీఆర్ లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిదని..ఆలా చేస్తేనే కరోనా కట్టడి అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధాని వీడియో కాన్ఫరెన్సు లో కూడా అదే చెప్పడం జరిగినట్లు సమాచారం. దీంతో కేంద్రం పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు సమాచారం. దీనిపై మంత్రులతో సమావేశమైన కేసీఆర్… ఈ విషయాన్ని కేబినెట్ భేటీ అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇక ఏపీ విషయానికి వస్తే లాక్‌డౌన్‌ను రెడ్‌ జోన్లకే పరిమితం చేయాలన్నది తన అభిప్రాయమని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి చెప్పినట్లు తెలుస్తుంది. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజా రవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాల్సి ఉందన్నారు. ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాల్సి ఉందని జగన్ చెప్పినట్లు సమాచారం.